ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఎనుబదిరెండవ పద్యము:
చంపకమాల:
వనిఁ జని, గొల్లలుం బసుల పాలనఁ జేయఁగఁ, బంబు జ్వాలలం
గని, యడల, న్వెస న్వెడలి, గ్రక్కున నార్పఁగ నిశ్చయించి, గొ
బ్బున జనరక్షకై, పరఁగఁ బ్లుక్షినిఁ ద్రావితె వాసుదేవ! జీ
వన మిడితే! హరీ! సఖుల వందన మందితె! శౌరి! కేశవా! 82
గర్భిత కందము:
చని, గొల్లలుం బసుల పా
లనఁ జేయఁగఁ, బంబు జ్వాలలం గని, యడలన్,
జనరక్షకై, పరఁగఁ బ్లు
క్షినిఁ ద్రావితె వాసుదేవ! జీవన మిడితే! 82
గర్భిత తేటగీతి:
పసుల పాలనఁ జేయఁగఁ, బంబు జ్వాల,
వెడలి, గ్రక్కున నార్పఁగఁ బ్రీతిఁ బూని,
పరఁగఁ బ్లుక్షినిఁ ద్రావితె వాసుదేవ!
సఖుల వందన మందితె! శౌరి! కేశ! 82
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి