Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 20, 2021

డెబ్బదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదియేడవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! శ్రితరక్షకా! క్రుధను ద్రోణ తనూజుఁడు గూర్చినట్టి నా
శ వృత కృతిన్ వెసన్ హత మసహ్య మపాండవ మాఁపఁగాను మా
ధవ! మతి నెంచియున్ ఋజు యుతాంచిత చర్యఁ బరీక్షితాఖ్యు చి
ద్భవమిడితే! తగన్ నిలిపి, వంశముఁ బెంచితె! నిత్య! కేశవా! 77

గర్భిత కందము:
శ్రితరక్షకా! క్రుధను ద్రో
ణ తనూజుఁడు గూర్చినట్టి నాశ వృత కృతిన్
మతి నెంచియున్ ఋజు యుతాం
చిత చర్యఁ బరీక్షితాఖ్యు చిద్భవమిడితే! 77

గర్భిత తేటగీతి:
క్రుధను ద్రోణ తనూజుఁడు గూర్చినట్టి
హత మసహ్య మపాండవ మాఁపఁగాను
ఋజు యుతాంచిత చర్యఁ బరీక్షితాఖ్యు
నిలిపి, వంశముఁ బెంచితె! నిత్య! కేశ! 77



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి