ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
డెబ్బదిరెండవ పద్యము:
చంపకమాల:
యుగ ఘన! రాఘవా! గుణిత యోజన పాణినిఁ, గుక్షి గంటి, శ
త్రు గతు, ఖలుం, గడున్ భయద రూపుని, దుష్టుఁ, గబంధుఁ గాంచి, తా
రుగఁ జని, బద్ధులై, కరము లూడ్చిన, కాల్చిన కౌసలేయ! చి
జ్జగ వరదా! హరీ! గత సుసంస్థితి నిచ్చిన గణ్య! కేశవా! 72
గర్భిత కందము:
ఘన! రాఘవా! గుణిత యో
జన పాణినిఁ, గుక్షి గంటి, శత్రు గతు, ఖలుం,
జని, బద్ధులై, కరము లూ
డ్చిన, కాల్చిన కౌసలేయ! చిజ్జగ వరదా! 72
గర్భిత తేటగీతి:
గుణిత యోజన పాణినిఁ, గుక్షి గంటి,
భయద రూపుని, దుష్టుఁ, గబంధుఁ గాంచి,
కరము లూడ్చిన, కాల్చిన కౌసలేయ!
గత సుసంస్థితి నిచ్చిన గణ్య! కేశ! 72
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి