Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2014

న్యస్తాక్షరి: ప్రతిపాదాద్యక్షరం వరుసగా జ-టా-యు-వు...ఛందస్సు:తేటగీతి...అంశం: జటాయు వృత్తాంతము

తేది: సెప్టెంబర్ 04, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- జటాయువు వృత్తాంతముఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా జ-టా-యు-వు ఉండాలని కోరగా
నేను రాసిన పద్యము:




జనక నంద నాపహరణ సమయమున జ
టాయు వడ్డంగ దశకంఠుఁ డమిత రోష
యుతుఁడుగా నయ్యు "నో జటాయు! గత పక్ష
వుగ నగు" మటంచుఁ బంతమ్ముఁ బూని నఱకె!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి