ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఇరువదినాలుఁగవ పద్యము:
ఉత్పలమాల:
ఏ దడి లేనిదౌ బగితి, నెప్పడుచున్ మునుఁ బాడి పాడి, ప్ర
హ్లాదుఁడు తా, నినున్ భజనలన్ నుతియించుచు, వప్త తిట్టు, లె
న్నో దుడుకున్ వెతల్ వడుచు, నోరిడి నిన్ బిలువండు! వత్తె యీ
వై దయతో, వెసన్ నృహరివై, నృపుఁ జంపితె నిష్ఠఁ గేశవా! 24
గర్భిత కందము:
దడి లేనిదౌ బగితి, నె
ప్పడుచున్ మునుఁ బాడిపాడి, ప్రహ్లాదుఁడు తా
దుడుకున్ వెతల్ వడుచు, నో
రిడి నిన్ బిలువండు! వత్తె యీవై దయతో! 24
గర్భిత తేటగీతి:
బగితి నెప్పడుచున్ మునుఁ బాడి పాడి,
భజనలన్ నుతియించుచు, వప్త తిట్టు
వడుచు, నోరిడి నిన్ బిలువండు! వత్తె
నృహరివై! నృపుఁ జంపితె! నిష్ఠఁ గేశ! 24
స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి