Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 03, 2021

ఇరువదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

ఇరువదియాఱవ పద్యము:

చంపకమాల:
నిను స్మరియించుచుం దనరు నీ వర భక్తుఁడు దంతినేత, ప
ట్టిన మకరిన్, వెసన్ సమితి డీకొని పోరఁగ శక్తిమాలియున్
నినుఁ ద్వరఁ బ్రార్థనం బిలువ, నీ వురు చక్రము వేసి, చంపి, యో
మిన వరదా! హరీ! యిడితె మెప్పుగ నిర్వృతి నీశ! కేశవా! 26

గర్భిత కందము:
స్మరియించుచుం దనరు నీ
వర భక్తుఁడు దంతినేత, పట్టిన మకరిన్;
ద్వరఁ బ్రార్థనం బిలువ, నీ
వురు చక్రము వేసి, చంపి, యోమిన వరదా! 26

గర్భిత తేటగీతి:
తనరు నీ వర భక్తుఁడు దంతినేత,
సమితి డీకొని పోరఁగ శక్తిమాలి,
పిలువ, నీ వురు చక్రము వేసి, చంపి,
యిడితె మెప్పుగ నిర్వృతి నీశ! కేశ! 26



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి