Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 05, 2015

సమస్య: అందఱకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్!

తేది: జూన్ 05, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు

(ఉదంకుఁడను మునీంద్రుండు జనమేజయుని సర్పయాగముం జేయుమని ప్రోత్సహించు సందర్భము)

"కొందల మందక కౌరవ!
ముందుగ నీ సర్పయాగమున్ మొదలిడుమా!
మ్రందఁగఁ జేసెడి విషధరు
లందఱకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్!!"(1)

***        ***        ***        ***(అపత్నీకుఁడై శ్రీరాముఁ డశ్వమేధయాగము నారంభించునని తెలిసినంతనే జను లిట్లనుకొనిన సందర్భము)
"ఎందుల కీ విధి దశరథ
నందనుఁడు నజాని యయ్యు నడపును జన్నం?
బిందునఁ బొందెద రశుభము;
లందఱకును గీడు గల్గు, యాగముఁ జేయన్!!" (2)
2 కామెంట్‌లు: