తేది: జూన్ 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
(కన్నీరుఁ గార్చుచు గాంధారి ధర్మజునితోఁ దన కుమారులఁ గూర్చి పలికిన సందర్భము)
(1)
కంట నీరొల్కఁ బల్కె నక్కడనుఁ జూచి
ధర్మజుని, తల్లి గాంధారి, "తాత! శకుని,
నాదు కొమరుల మనముల నాది నుండి
మార్చివైచెను గాన దుర్మార్గులైరి!"
(తాత! = నాయనా!)
*** *** *** *** ***
(2)
కంకుఁ డని పిల్తు రెవని? నిన్ గన్న దెవరు?
తానె గంతలం గొనె నేరు? తండ్రి తండ్రి
నేమి యనెదరు? కౌరవ హితుఁ డెవండు?
ధర్మజుని-తల్లి-గాంధారి-తాత-శకుని!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి