తేది: జూన్ 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
(రావణ సంహారము పిదప విభీషణుఁడు శ్రీరామునితో భాషించిన సందర్భము)
(1)
"ఈ క్ష్మాజ నిన్నుఁ జేరఁగ
లక్ష్మణుఁ డానందమందె! లంకకు రాజైయీ క్ష్మాతల మేలుమయా!
సూక్ష్మమిది! యయోధ్యయేల? శూరోత్కృష్టా!!"
*** *** *** *** ***
(సీతారాముల సమాగమమునుం గనిన విభీషణుఁ డానందించిన సందర్భము)
(2)
పక్ష్మలకాకయె సీతయు
నా క్ష్మావరుఁ గన, విభీషణాఖ్య సుగుణుఁడౌ
సూక్ష్మదృ గధిగత వినమిత
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై!
నా క్ష్మావరుఁ గన, విభీషణాఖ్య సుగుణుఁడౌ
సూక్ష్మదృ గధిగత వినమిత
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి