చంపకమాలిక:
జలధిని దాఁటి, యా సురసఁ ♦ జప్పునఁ దాఁ దెగటార్చి, లంకిణిన్
బొలియిడి, లంకఁ జొచ్చి, భువి♦పుత్రినిఁ గాంచియు, నుంగ్ర మా సుకో
మలి కిడి, వృక్షవాటికను ♦ మాపి, దశాస్యసుతద్వయమ్ముఁ ద్రె
క్కలిగొని, బమ్మయమ్ము తనుఁ ♦ గట్టఁగ బంధితుఁడయ్యు, రావణున్
గలిసి, రఘూత్తమున్ బొగడి, ♦ కాల్చియు లంకనుఁ, జేరి రామునిన్,
నెలతుక వర్తమానమిడి, ♦ నెయ్యపుఁ గాన్కను ముట్టఁజెప్పి, ధీ
బలుఁడగు రామమూర్తికిఁ గృ♦పాళునకుం గలిగించి తృప్తినిన్,
వలచె మహత్త్వమా యెడను ♦ వాయుసుతుం డట రామబంటుగన్!
*శుభంభూయాత్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి