దత్త పద్యము:
చేతులారంగ శివునిఁ బూ♦జింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి ♦ నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ ♦ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల ♦ కడుపుచేటు!
[పై పద్యభావము నుత్పలమాలా వృత్తమందు]
పరివర్తనము:
ఉ.
పూనియుఁ జేతులారఁగ శి♦వుం దగఁ బూజలు సేయఁడేని; వా
గ్లీనత నోరు నొవ్వ హరి ♦ కీర్తి వచింపక యుండునేని; వి
శ్వాన నరుండు తా దయయు ♦ సత్యము లోనఁ దలంపఁడేని; నా
హీనుఁడు తల్లికిం గలుగ ♦ నేటికిఁ? దల్లుల కడ్పు చేటగున్!
-:శుభం భూయాత్:-
అద్భుతమైన పద్యమండి!
రిప్లయితొలగించండిఅద్భుతమైన పద్యమండి!
రిప్లయితొలగించండి