Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఏప్రిల్ 25, 2016

పద్య పరివర్తనము: చేతులారంగ శివుని....పద్యం...ఉత్పలమాలలో...



దత్త పద్యము:

చేతులారంగ శివునిఁ బూ♦జింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి ♦ నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ ♦ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల ♦ కడుపుచేటు!

[పై పద్యభావము నుత్పలమాలా వృత్తమందు]

పరివర్తనము:

ఉ.
పూనియుఁ జేతులారఁగ శి♦వుం దగఁ బూజలు సేయఁడేని; వా
గ్లీనత నోరు నొవ్వ హరి ♦ కీర్తి వచింపక యుండునేని; వి
శ్వాన నరుండు తా దయయు ♦ సత్యము లోనఁ దలంపఁడేని; నా
హీనుఁడు తల్లికిం గలుగ ♦ నేటికిఁ? దల్లుల కడ్పు చేటగున్!

-:శుభం భూయాత్:-


2 కామెంట్‌లు: