ఉ.
“నిండుమనంబు నవ్యనవ♦నీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జ♦గన్నుత విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విప♦రీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నర♦పాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్”
>>>నన్నయ గారి పై పద్యము యొక్క భావమే...
.......నేను రచించిన తేటగీతిలో...
తే.గీ.
భూసురుని యెద మిసిమియౌ! ♦ బాస కఱకు!
కాన, శాప మిడియుఁ ద్రిప్పఁ ♦ గలఁ డతండు!
భూవరున కిది విపరీత♦ము నగుఁ గాన,
శాప మిడియునుఁ ద్రిప్పంగఁ ♦ జాలఁ డితఁడు!!
-:శుభం భూయాత్:-
మిత్రులార్తా! నమస్సులు!!
రిప్లయితొలగించండి"అయుత మధుర కవితా స్రవంతి"పై క్లిక్ చేయండి...బ్లాగులోకి వెళ్ళండి...చదవండి...మీ అభిప్రాయం తెలపండి.
చిక్కనౌ సూత్రాన్ని చక్కనైన పద్యంలో చెప్పారు....మీ ప్రతిభ అలాంటిది
రిప్లయితొలగించండిచిక్కనౌ సూత్రాన్ని చక్కనైన పద్యంలో చెప్పారు....మీ ప్రతిభ అలాంటిది
రిప్లయితొలగించండి