Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, నవంబర్ 02, 2014

నిషిద్ధాక్షరి: భరతమాత స్తుతి...

తేది: అక్టోబర్ 08, 2014 నాటి శంకరాభరణంలో
నిషిద్ధాక్షరి శీర్షికన
మొదటిపాదంలో వర్గాక్షరాలను,
రెండవపాదంలో వర్గాక్షరాలను, 
మూడవపాదంలో వర్గాక్షరాలను,
నాల్గవపాదంలో వర్గాక్షరాలను
ఉపయోగించకుండా
భారతమాతను స్తుతిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి మఱియు సీసపద్యములు:


(౧)
తేటగీతి:
శిరము హిమధామ సుందర వర మహాద్రి!
పాదముల్ మహాలవణాబ్ధి! భవదుపమిత
రూపవైశాల్య మరసి, కారుణ్యశీలి!
వైరులుం గొనఁ, ద్రోలిరి వీర సుతులు!


(౨)
సీ.
అమ్మ భారతమాత! హారతులందింతు
....నంది యానందమ్ము నందఁజేయ,
మమ్ము దోషములేని మార్గాన నడిపియు
....నుత్తమోత్తమ సుతు లుత్తములని
మెచ్చుచుఁ బరరాజ్య మేలువారలు వేగ
...మిటకడుగిడి చూచి మేర మఱచి
యానంద వశులయి యాహా యటంచును
....నిన్నుఁ గీర్తించఁగా నిఖిల జగతి

గీ.
లోనఁ బేరెన్నఁబడ నెప్డు భానుమండ
లోన్నత ప్రభా సహిత విలోకనములఁ
గరుణఁ జూచుచు మమ్ముఁ బ్రకట విశాల
జీవులనుఁ జేయ వినతి సుస్నిగ్ధవదన!!

(సీసపాదములవలెనే...గీతపాదములలోనను పై నియమ మఱయునది)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి