తేది: అక్టోబర్ 09, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ఒక యింటి కోడండ్రు తమ యింట జరుగు తతంగమునుం బరులు కనకుండుటకుం జేసిన యుపాయము)
ఇంటి ముంగిలి హద్దుగా నెనుఁగు లేక
బయటివారలు తమయింటఁ బరఁగు కతలఁ
గనుచు నుండంగఁ, గనకుండు కారణమ్మ
గడ్డములఁ బెంచి, మురిసిరి కాంత లెల్ల!
{కనకుండు కారణమ్ము + అగు + అడ్డములన్ + పెంచి మురిసిరి = అడ్డముగనుంటకై మొక్కలం బెంచి, చాటగుటచే మురిసిపోయిరని భావము}
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి