తేది: అక్టోబర్ 24, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
కటి - కిటి - తటి - నటి
పదాలను ఉపయోగిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి మఱియు (అదే భావంతో) కందపద్యం:
తే.గీ.
కటిక చీఁకటి పొరలను ఖండములుగఁ
జీల్చి, వాకిటి తలుపు ముంజేతితోడఁ
ద్రోచి, వచ్చి, మేల్కొల్పు సద్రుచుల! నెంత
టి మొనగాండ్రపై నైన నటించును రవి!!
పై (తేటగీతి) పద్యభావమే కందపద్యమున...
కం.
కూకటి వ్రేళులఁ జీఁకటి
వేకువ జాముననుఁ గూల్తువే వాకిటిలోఁ
దేఁకువ నిడి! నీ వెంతటి
నాకాధీశు పయి నయిన నటియింతువయా!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి