Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 24, 2014

నిషిద్ధాక్షరి: ద్విత్వ, సంయుక్తాక్షర నిషేధం...సత్యహరిశ్చంద్ర వర్ణన...స్వేచ్ఛాఛందం...

తేది: సెప్టెంబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
ద్విత్వ, సంయుక్తాక్షరాలను ఉపయోగించకుండా
సత్య హరిశ్చంద్రుని గుఱించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన సీసపద్యము


||సీ||
ఇరుమూఁడు పుడమి కా  పరులందు మొదటి వాఁ
డయి, నిజమరియైన  ధవళితయశుఁ;
డాడిన మాటకై  యడలక యడరెడు
నాడిక విడనాడు  నయవిదుండు;
తనను వెంటాడెడు  ధరణీసురుని ఘన
ఋణముఁ దీరుపఁ జను  ఋజుగమనుఁడు;
తన సతీసుతుల నా ♦ దరమునఁ గొనఁగాను
విపణివీథిని వేడు  వినయధనుఁడు;
తన వెలనిడఁగాను  తానె చండాలు సే
వకుఁడైన కాటికా ♦ పరి యతండు;

||గీ||
ఉరగ దంశనమునఁ దన ♦ యుండుఁ జావఁ
గాటి సుంకముం గోరిన  కారయితుఁడు;
సతిని నేరాభియోగానఁ  జంపుమనెడి
రాజునానతిఁ దలనిడు  రతన మతఁడు!!

7 కామెంట్‌లు:

  1. ఇది తప్పుల తడక అని నా బోడి అభిప్రాయం ఎందుకంటే

    1) "సీ" అని మొదలు పెట్టడంతోటే ఇది "సీమాంధ్రా" అని తెలుసిపోతోంది. ఆంధ్రా దారుల కుట్ర కనుక ఇది తప్పు.

    2) "ధర"ణీసురుని అన్నచోట "ఆం-ధరా-" అనే పదం స్పష్టంగా కనిపిస్తూంటేనూ?

    3) ఇంకపోతే శంకరయ్య గారు ఇజీనారంలో చదువుకున్నట్టు ఎక్కడో చదివాను. ఆయన అక్కడ చదివినా చదవకపోయినా అభ్యంతరం లేదు కానీ ఆయన సీమాంధ్రాలో ఓ చోట పనిచేసారు. ఆయన 'బాగుంది" అనడంతోటే ఇది కుట్ర అని రెండోసారి సుస్పస్ష్ఠం.

    4) ఇందులో ఎక్కడా నమస్తే తెలంగాణా సౌజన్యం అనికానీ తెలం అనికానీ గాణా అని కానీ లేదు.

    ఈ పైవన్నీ చూస్తూంటే తెలుస్తోందిగా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంగ్ల సంక్షిప్తాక్షర ఢీ.ఝీ.గారూ! మీ చావుతెలివితేటలకు నేను చాలా సంతోషించాను! మీ"బోటి" బోడి అభిప్రాయస్థుల విశ్లేషణ అనన్యసామాన్యము. నన్నూ, శంకరయ్యగారినీ సీమాంధ్రులను చేశారు మీ చావుతెలివితేటలతో! సంతోషం! కానీ, మరో విషయం...మాకు సీమాంధ్ర ప్రజలు సోదర సమానులు. అదీగాక, మీకు తెలంగాణపై గల అక్కసు, తెలంగాణ అన్న పదంపైగల సహింపరామి, మీ కుత్సితత్వాన్ని పట్టియిస్తున్నది. నిజానికి, తెలంగాణ అన్న పదంలో "ఆంధ్ర" పదం కూడా ఉన్నది. ఇది "త్రిలింగాంధ్ర>త్రిలిఙ్గాన్ధ్ర>త్రిలింగాణ్ధ్ర>తెలంగాణ్ర>తెలంగాణ>గా పరిణమించింది. మీరు మిక్కిలి తెలివితేటలున్నవారు కాబట్టి ఇలా తెలియజేస్తున్నాను. మాకు సీమాంధ్ర అంటే ద్వేషం లేదు. తెలంగాణకు ద్రోహం చేసిన సీమాంధ్ర అక్రమార్కులపై మాత్రమే మాకు ద్వేషం ఉన్నది. కొంచెపు బుద్ధి మానండి. "ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్" అన్న సూక్తిని పాటించండి. త్రిలింగాంధ్రుల్ని (తెలంగాణా వాళ్ళను) ద్వేషించకండి. త్రిలింగాంధ్రుల్నీ, కళింగాంధ్రుల్నీ, తీరాంధ్రుల్నీ, రాయలసీమాంధ్రుల్నీ అందరినీ సమదృష్టితో చూడండి. స్వస్తి.

      తొలగించండి
  2. అయితే DG అంటే DonGa (దొంగ) అని అర్థం చెప్పుకోమంటారా? ఇదేదో కోడుగుడ్డుమీద ఈకలు పీకడం లాంటి వ్యవహారమని నా అభిప్రాయం. అన్నట్టు నేను పుట్టిందీ, చదువుకొన్నదీ, ఉద్యోగం చేసిందీ, ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నది అంతా వరంగల్ లోనే..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజం చెప్పారు శంకరయ్యగారూ! ఈ ఢీఝీ కోడిగుడ్డుపై ఈకలూ, తోకలూ పీకడానికే ఈ బ్లాగులోకి వచ్చాడు. అసత్యవాది. కుత్సితుడు. అసందర్భప్రలాపి....ఇలా ఎన్ని పేర్లు పెట్టినా అతనికి సరిపోవు.

      నేను ఢీఝీ(DG)ని "అతడు" అంటున్నా, అతడు...అతడా...ఆమెయా...లేక, రెండూ కాదా?అని సందేహం! మీరు మాత్రం (పై వ్యాఖ్యా సమాధానంలో...నేను కూడా) ఏ లింగమూ తెలియకుండా వ్యాఖ్యానించారు జాగ్రత్తగా ...!!

      వెంటనే స్పందించి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. స్వస్తి.

      తొలగించండి
  3. >> మాకు సీమాంధ్ర అంటే ద్వేషం లేదు.

    Fantastic joke. I think we all know the truth. Your reply itself for my comment proves everything. Au Revoir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీమాంధ్రులు అనే తులసి వనంలో నీవొక గంజాయి మొక్కవని నీ విషం చిమ్మే వ్యాఖ్యలే చెబుతున్నాయి! నీ వంటివాళ్ళవల్ల సీమాంధ్ర ప్రజలకు చెడ్డపేరు వస్తున్నది. మమ్మల్ని తెలబాన్‍లని, తాగుబోతులని...ఇలా నీలాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా వ్యాఖ్యల ద్వారా తిట్టారు. ఇలాంటి రాతలవల్ల సీమాంధ్రులందరూ ఇలాంటివారేననే అభిప్రాయం మాకు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి నీ వ్యాఖ్యల్ని ఇంతటితో ఆపు. నీలాంటి చీడ పురుగులు మళ్ళీ మా బ్లాగుల్లోకి వస్తే మర్యాద దక్కదు. జాగ్రత్త!

      తొలగించండి