తేదిః నవంబర్ 09, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన
ఆటవెలఁది పద్యమందలి నాలుగు పాదాలలో
మొదటి అక్షరాలుగా వరుసగా ‘రా - మా - రా - వు’ ఉండాలని,
అంశం- రావణుని పాత్రలో ఎన్.టి.రామారావును వర్ణించాలనగా
నేను వ్రాసిన రెండు పూరణములు
(1)
రావణుండు యన్‍టి రాముండు నటనతో
మా మనమ్ములందు మహితుఁ డాయె!
రాముఁడైన నతఁడె! రావణుం డతఁడె! భా
వుకుఁ డెవం డతనినిఁ బోలువాఁడు?
(2)
రావణుండ శివుఁడ రాముఁడ కర్ణుఁడ
మాధవుండ భీష్మ మఱియుఁ గృష్ణ
రాయఁడవన నీవెరా! నటరత్నుఁడ
వు గదర! ఘనుఁడవగు ముఖ్యమంత్రి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి