తేది: నవంబర్ 11, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
శవము - పాడె - కాడు - చితి
పదాలను ఉపయోగిస్తూ
జన్మదినోత్సవాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యములు
(1)
కేశవ మురజి న్మాధవ కృష్ణ చక్రి
యనుచు హరిభక్తి జలధిలో మునిఁగి పాడె
నాదు చెలికాఁడు జన్మదినమ్మునాఁడు
మురిసి హరిఁజూచి తిరునామమును ధరించి!
(2)
కేశవ! ముకుంద! మధురిపు! శ్రీశ! చక్రి!
నన్నుఁ గాపాడెదవటంచు సన్నుతింతు!
కరుణ తొలుకాడునటుల నన్ గాంచ, విమల
మతిని జన్మదినమున నెంచితిర నిన్ను!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి