Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఏప్రిల్ 20, 2015

సమస్య: భీముని భార్య యూర్వశి విభీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే

తేది: డిసెంబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:(ఒక సంపన్న గృహస్థుఁడు తమ నమ్మిన బంటు భీమునిం బరిచయము సేయుచుఁ దన బంధువర్గముతోఁ బలికిన సందర్భము)

నేమముతోడ మా గృహము ♦ నెప్పుడుఁ గాఁచుచు, మమ్ముఁ గొల్చుచున్,
క్షేమముగా వసించుచు, వి ♦ శేష విధిన్ సహకారి యౌచునున్,
భీముఁడు కాఁపురస్థుఁడయె! ♦ వీరలు భీముని బంధు! లీమెయే
భీముని భార్య యూర్వశి! వి ♦ భీషణుఁ డాత్మజుఁ! డన్న శౌరియే!2 కామెంట్‌లు:

  1. మీ చుట్టరికాల పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించు
  2. ధన్యవాదాలు శంకరయ్యగారూ! ఇలాగే ప్రతిదినమూ నా బ్లాగుపోస్టులను సమీక్షిస్తూండగలరు...తగు సూచనలిస్తూండగలరు.

    రిప్లయితొలగించు