తేది: నవంబర్ 18, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
(హిరణ్యకశిపుని దుశ్చర్యలకు దుఃఖితులైన దేవతలు తమలోఁదాము మాటలాడుకొను సందర్భము)
"తిరమగు తపమును మెచ్చియు
దురితములనుఁ గనకయే చతుర్ముఖుఁ డటులన్
వరమిడఁ గశిపుఁడుఁ జెలఁగెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"
నా పై పూరణమునుం గొంచెము మార్చి వ్రాసి, య్తీ దిగువఁ బ్రకటించితిని. గమనింపఁగలరు.
హిరణ్య కశిపునకు బ్రహ్మ హితమౌనటులన్
వరమిడ, మన నిటుఁ జెఱచెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"
మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిచాలారోజుల తర్వాత పోస్ట్ పెట్టినట్టున్నారు. సంతోషం.
మీ పూరణ చాలా బాగున్నది.
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండినేను దాదాపుగా 5వ తేదీ నుండి ప్రతిదినమూ పోస్ట్ పెడుతున్నాను. అన్నీ పరిశీలించి, మీ అభిప్రాయం తెలుపగలరు. స్వస్తి.