తేది: నవంబర్ 08, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
స్మరణ సుకీర్తన శ్రవణ సఖ్య నివేదన సేవ నార్చనా
పరతను దాసులై యెపుడు వందనమున్ దగఁ జేయుచున్ హరిన్
నిరతము హృత్సరోజమున నిల్పక, నిత్యము హృత్స్థయౌ మనో
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!
బాగుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్యామలరావుగారూ!
రిప్లయితొలగించండి