తేది: నవంబర్ 17, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
మామ - అత్త - బావ - వదిన....పదాలను ఇచ్చి
స్వార్థంలో ఉపయోగించకుండా
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన రెండు తేటగీతులు మఱియు ఒక చంపకమాల పద్యము
నా మొదటి పూరణము:
(కురుసభలో్ శ్రీకృష్ణుఁడు ధృతరాష్ట్రునితోఁ బలికిన సందర్భము)
"మామ! మామకోక్త విషయమై త్వదీయ
సుతులు బంధింప నాయత్తకృతులునైరి!
కాన, మిముఁ బావనులఁ జేయు క్రమములోని
దీ విరాడ్రూపముఁ గనవ! దినకరసమ!"
నా రెండవ పూరణము:
(శ్రీకృష్ణుఁ డర్జునుని యుద్ధమునకై పురికొల్పు సందర్భము)
"చూపుమా మహాశౌర్యప్రతాపములను!
యుద్ధమాయత్తమాయె, నో యిద్ధచరిత!
బాడబావహ్నికీలోగ్రభాసమాన!
నీవ దినమణి సుతునోర్చ నెగడు యశము!"
నా మూఁడవ పూరణము:
(సంజయుఁడు ధృతరాష్ట్రునకు కురుక్షేత్రమందు యుద్ధమెటుల జరుగుచున్నదో వివరించు సందర్భము)
ఇది వినుమా మహోగ్రతర హింస్ర యుతాంచిత హేతివాదరల్
కదనమునందుఁ ద్రుంచ క్షతగాత్ర విరోధి గతాత్త రోషముల్
వదన సరోవరాంబక వివర్ణ సమాక్రమితమ్మయెన్ బయిన్
జదలది యెఱ్ఱఁబాఱినది సాంధ్యనుఁ బావనమౌ దివిప్రసా
ద దినపరాస్తతావదినదర్శితమయ్యెను సంగరమ్మునన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి