తేది: నవంబర్ 16, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు:
నా ప్రథమ పూరణము:
(చిత్రకారుఁ డొకఁడు తన నేర్పునుపయోగించి శార్దూల చిత్రమునుం జిత్తరువున వ్రాసిన సందర్భము)
సుందరుఁడగు చిత్రకార సుకరుం డొకఁడున్
డెందమున సంతసించుచు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!!
నా ద్వితీయ పూరణము:
(ఒక యాంగ్లేయ బాలకుఁడు తెలుఁగున "శార్దూలము" అనెడి పదమును వ్రాయఁబ్రయత్నించు సందర్భము)
విందుగఁ దెలుఁగుననుఁ దాను వింత యెసఁగఁగన్
బొందిక పదముల లేఖన
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!
బొందిక పదముల లేఖన
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి