తేది: డిసెంబర్ 05, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
చీమ - దోమ - నల్లి - పేను
పదాలను ఉపయోగిస్తూ
గోపికావస్త్రాపహరం గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతిపద్యం
తచ్ఛచీమనోహరునకుఁ దమ్ముఁడైన
యా యుపేంద్రుఁడౌ కృష్ణుండు నపుడెదో మ
హాద్భుతమగు నుపాయమ్మునల్లి గోపి
కాంశుకాల్గొని యొప్పేనుఁ గాంచితనియె!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి