తేది: నవంబర్ 20, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు:
నా మొదటి పూరణము:
మోదముతోడుత నరులటఁబాదపముల మొదలు నఱకి ♦ వాహనమం దా
ఛేదిత తరులనిడి నడుపఁ
బాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!
(పాదములు=వ్రేళ్ళు)
*** *** ***
నా రెండవ పూరణము:
మోదిత మతులై నఱకిన
పాదపములఁ బల్లమునకుఁ ♦ బడఁద్రోయంగన్
రోదించుచు దొరలుచు నా
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!
*** *** ***
నా మూఁడవ పూరణము:
(సత్యభామా సమేతుఁడై శ్రీకృష్ణుఁడు నందవవనమందలి పారిజాతవృక్షమునుం గొని, గరుడునిపైనిడుకొని పైకెగురఁగా, గరుడుని ఱెక్కల గాడ్పుల తాఁకిడికి పెల్లగిలిన యితర దేవతరువులు కూడ నా గాలితోపాటు పైఁకిలేచి వెంటఁదవిలిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)
మోదము సతికిడ దివిఁ జని,
పాదపముం గొనియు గరుడ ♦ వాహనము పయిన్
బోఁదలఁచి యెగుర, గాలినిఁ
బాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!
(సత్యభామా సమేతుఁడై శ్రీకృష్ణుఁడు నందవవనమందలి పారిజాతవృక్షమునుం గొని, గరుడునిపైనిడుకొని పైకెగురఁగా, గరుడుని ఱెక్కల గాడ్పుల తాఁకిడికి పెల్లగిలిన యితర దేవతరువులు కూడ నా గాలితోపాటు పైఁకిలేచి వెంటఁదవిలిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)
మోదము సతికిడ దివిఁ జని,
పాదపముం గొనియు గరుడ ♦ వాహనము పయిన్
బోఁదలఁచి యెగుర, గాలినిఁ
బాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి