తేది: ఆగస్టు 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
నా మొదటి పూరణము:
మార రిపుండు గోవుగను మారియు, దుగ్ధము నీయకున్నఁ, దా
దారగ చోళభూపతి సుతన్ దగ నెట్టుల పొందునో? కనన్
శౌరికి శ్రీనివాసునకు సాధు జనార్చన వందనాలికై
శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండు శంభుఁడే!!!
*** *** *** ***
నా రెండవ పూరణం:
కూరిమి నా గజాసురుఁడు కోరియు దేవతలన్ మహాపదన్
గూరఁగఁ జేయ, వారు హరు గొబ్బునఁ జేరియు, రక్ష వేడ, నా
గౌరు శిరమ్ముఁ ద్రుంచియుఁ, ద్వగంబరముం గొని, వేగ నిర్వృతి
శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె, శంభుఁడే!
గూరఁగఁ జేయ, వారు హరు గొబ్బునఁ జేరియు, రక్ష వేడ, నా
గౌరు శిరమ్ముఁ ద్రుంచియుఁ, ద్వగంబరముం గొని, వేగ నిర్వృతి
శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె, శంభుఁడే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి