తేది: ఆగస్టు 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(పండిత వేషమున నున్న యొక పామరుని మాటల నొక కవి విశ్లేషించుచున్న సందర్భము)
"పాండవు లనఁగాఁ దెలియదె?
దండిగ మంచంపుఁ గోళ్ళ దత్తున మువురం
చుండి"రని, రెండుఁ జూపెడు
పండితుఁ డన నెవఁడు? పరమ పామరుఁడు గదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి