తేది: ఆగస్టు 03, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(పింగళి సూరన కళాపూర్ణోదయమందుఁ గాళికామాత మహిమ[బ్రహ్మవాక్కు, సరస్వతీవరము]చే సుముఖాసత్తిగ మాఱిన మణిస్తంభుఁడు...మణిస్తంభునిగ మాఱిన సుముఖాసత్తి వలన...గర్భముం దాల్చి, కళాపూర్ణునిం బ్రసవించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)
తరుణిగ మాఱిన పురుషుఁడు,
పురుషునిగను మాఱినట్టి ముదిత సురతినిన్
మురియఁగఁ; దరుణిగ మాఱిన
పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్!
రిప్లయితొలగించండిపరమాత్మ విష్ణు వాగతి
వరమోహిని రూపమెత్త , వలచెను శివుడా
యిరువురకు బుట్టె నయ్యప
పురుషుడు గర్భమ్ము దాల్చి పుత్రుని గనియెన్