తేది: జులై 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
నా మొదటి పూరణము:
కన్నవాఁ, డుపనేత, శిక్షకుఁడు, నన్న
దాతయుం, భయత్రాతయుఁ దఱచి చూడఁ
దండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!
శంకరాభరణోత్కృష్ట! శంకరార్య!!
పై పూరణమునందు నాకు ఆధారమైన శ్లోకమిది:
జనితా చోపనేతా చ, యశ్చ విద్యాం ప్రయచ్ఛతి, |
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితరః స్మృతాః ||
*** *** *** ***
నా రెండవ పూరణము:
కన్నవాఁడును, నిల్లాలి కన్నతండ్రి,
వడుగుచేసినవాఁడు, గురుఁడును, నన్న
యంచు గణనసేయఁగఁ గొనియాడఁబడెడి
తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!
nenu
రిప్లయితొలగించండిమిత్రులు భాస్కర శర్మగారికి నమస్సులు! మిత్రమా బాగున్నారా? మీ సోదరులు నారాయణ మూర్తి ఎలా ఉన్నారు? మీ కవితా వ్యవసాయం ఎలా నడచుచున్నది? తెలుపగలరు!
రిప్లయితొలగించండిమీరేదో చెప్పాలనుకొని...అర్ధాంతరంగా మానుకొన్నట్టున్నది! నేను...అని ఆగారు! ఆ తర్వాత...?