తేది: ఆగస్టు 05, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(పింగళి సూరన విరచితమైన ప్రభావతీ ప్రద్యుమ్న కావ్యనాయిక ప్రభావతి. ఆమె తండ్రి వజ్రనాభుఁడు. అతని తమ్ముఁడు సునాభుఁడు. ఆ సునాభుని కూఁతురగు చంద్రవతితో, నామె పెంపుడు చిలుక, యామె ప్రియుఁడగు గదుని వెదుకం బోయి, చిక్కులం దెచ్చుకొనిన విషయమునుం దెలుపుచు, గదుఁడే తన్ను విడిపించినాఁడని నుడివిన సందర్భము)
"మంజువచన! చంద్రవతి! ని
రంజనసఖభటులు పంజరమ్మున నిడ, నా
బంజరమందుం గని, శుక
సంజీవని! నన్ గదుండు సరగునఁ దెచ్చెన్!!"
(...నంగదుండు...> నన్ గదుండు...)
రంజనసఖభటులు పంజరమ్మున నిడ, నా
బంజరమందుం గని, శుక
సంజీవని! నన్ గదుండు సరగునఁ దెచ్చెన్!!"
(...నంగదుండు...> నన్ గదుండు...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి