తేది: జులై 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు (ప్రహేళికా రూపమున) నా పూరణము
విరామచిహ్నముల నుంచకముందు:
కొమ్మనుండుఁ గ్రోఁతి కోరిన సిరులిచ్చు
లచ్చి యేడ్చు శిశువు మెచ్చు మధువు
తేఁటి మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు కాకి పలలముఁ దిను!
ఈ దిగువ నున్నది చదవండి:
విరామచిహ్నముల నుంచిన పిదప:
కొమ్మనుండుఁ గ్రోఁతి; కోరిన సిరులిచ్చు
లచ్చి; యేడ్చు శిశువు; మెచ్చు మధువు
తేఁటి; మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు; కాకి పలలముఁ దిను!
లచ్చి; యేడ్చు శిశువు; మెచ్చు మధువు
తేఁటి; మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు; కాకి పలలముఁ దిను!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి