తేది: ఆగస్టు 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
రోగముక్తుఁడైన భోగికి నీయంగఁ
బుష్టికరమునయ్యు, నిష్టపడెడు,
కమ్మనయ్యు, నొక్క కలశాన, నొక్క గో
వీఁగ, పడిన పాలు, హిత మొసంగు!
(గోవు+ఈఁగ [=గోవు ఈయఁగా], కలశాన-పడిన-పాలు, హిత మొసంగు...నని అన్వయము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి