Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 08, 2014

సమస్య: నెలలో సుతుఁ గన్న తల్లి, నిగనిగలాడెన్

తేది: సెప్టెంబర్ 21, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



ఇలలో నాఁటికి నేఁటికి
నలుసంతయినట్టి మార్పు "నాస్తి" యనంగన్
బలిమేమి? తొమ్మిదవదగు
నెలలో సుతుఁ గన్న తల్లి, నిగనిగలాడెన్!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి