Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 06, 2014

సమస్య: శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి

తేది: సెప్టెంబర్ 18, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణముమగఁడుఁ జావఁగ, రామలక్ష్మణులఁ గోరె! 
ముకు సెవుల్గోయఁ బగఁ బూని మూర్ఖముగను
శూర్పణఖ, "సాధ్వి, లోకైక సుందరాంగి
సీతఁ గొని ర"మ్మనియు నన్నఁ జేరి పలికె!!


2 కామెంట్‌లు:

  1. ఆర్యా ! ఈ బ్లాగులో ఈ పూరణమూ, ఇతర పూరణాలు కూడా చాలా బావున్నాయి. అరుదైపోతున్న అవధాన కళాంశాలను మీ కవితాకౌశలంతో పునరుజ్జీవింపజేస్తున్నారు. ఇందుకు చాలా వైదుష్యమూ, సమయస్ఫూర్తీ కావాలి. భగవంతుడు మీకు ఇవన్నీ సమృద్ధిగా ప్రసాదించడం ముదావహం. ఈ బ్లాగులో ఇకముందు ప్రచురితం కానున్న పద్యాల కోసం కూడా ఎదురుచూస్తూంటాను. హార్దిక నమస్సుమనస్సులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ! మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుడను. మీరు మీ బ్లాగుద్వారా తెలుగుభాషకు చేస్తున్న సేవ అమూల్యము, అసదృశము. మీకు నా మనఃపూర్వక అభినందనలు!

      తొలగించండి