Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

పద్య రచన: గణేశ నిమజ్జనం


శ్రీగణనాథునిఁ గొలిచితి
మేగఁగ వలె స్వీయనిలయ మిప్పుడటంచున్
వేగమె నిమజ్జనమ్మును
సాగరమునఁ జేయఁ గోరి సాఁగ నిడి రటన్!

2 కామెంట్‌లు:

  1. పూజించిరి గణ నాధుని
    రాజిత ఫల పుష్ప పత్ర రాజముల కడున్
    రాజసముగ నీ రోజున
    తేజోనిధి వీడె భువిని తృప్తుండగుచున్ .
    బ్లాగు :సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  2. సాహితీ మిత్రులు రాజారావుగారికి నమస్కారములు! తమరు నా పద్యమునకు స్పందించి, బదులుగ మఱియొక పద్యము వ్రాసినందులకు ధన్యవాదములు!

    తమరి సాయీ స్తోత్రము చాల బాగుగ నున్నది. అభినందనములు.

    జయ షిరిడీ సాయీశా!
    జయతు జయతు సకల సుజన సంతోషకరా!
    జయ దీనజనార్త్యపహా!
    జయతు జయతు సౌఖ్యదాయి! జయ యోగీంద్రా!

    రిప్లయితొలగించండి