Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 12, 2013

సమస్య: బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ

బానిస బ్రతుకు కన్న మరణమే మేలని నిరాశతోఁ జావఁ గోరు నొక భారతీయునకు ధైర్యముఁ గూర్చుచు గాంధీ పలికిన సందర్భము


నేనుంటి, స్వేచ్ఛఁ గొను, మో
 బానిస! బ్రతుకే నయమని పలికెను గాంధీ
తేనియ లూరెడి స్వేచ్ఛా
గానము వినిపించి, ప్రజకు జ్ఞానముఁ బెంచన్!

1 కామెంట్‌:

  1. మీ పూరణ కవిత్వపు తేనియలను కురిపిస్తున్నది. గాంధీగారి చిత్రాన్ని జోడించడం ఇంకా బాగుంది. మీకు నా అభినందనలు.
    పోస్ట్ శీర్షిక విషయంలో నా సలహాను ఆచరణలో పెట్టలేదు. లేకుంటే మీ బ్లాగులో ఎక్కువగా శంకరాభరణమే కనిపిస్తున్నది. హారం తదితర అగ్రిగేటర్లలోనూ శంకరాభరణమే కనిపిస్తున్నది. మార్చండి.

    రిప్లయితొలగించండి