కవి పండిత మిత్రులకు, వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!
స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో உహమ్! (1)
ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో உస్తు తే உనిశమ్! ( 2)
ర్భుజా! నమో உస్తు తే உనిశమ్! ( 2)
ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే உహమ్! (3)
శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద
బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా!
(4)
వంశస్థము:
నమో నమో విఘ్న
వినాశకాయ తే!
నమో విచిత్రాయ!
వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః!
(5)
వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా!
(6)
స్రగ్విణీ
వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ!
నమః! (7)
ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన
ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ
విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత!
వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ!
తే నమః! (8)
భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ!
త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా!
వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త
ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృ తీశా!
నమస్తే! (9)
-:< శుభం భూయాత్
>:-
మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండివినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష వృత్తాలతో గణనాధుని స్తుతించారు. అద్భుతంగా ఉన్నాయి. పూర్తిగా సంస్కృతంలో వ్రాసినా తెలుగు సంప్రదాయాన్ని పాటిస్తూ యతిప్రాసలను ప్రయోగించడం ఆనందాన్ని కలిగించింది. మీరు ఎన్నుకున్న ఛందాలు కూడా లయబద్దంగా చదవుకొనడానికి వీలుగా ఉన్నాయి. మీ బ్లాగు దిగ్విజయంగా పురోగమిస్తూ, ‘ఆంధ్ర పద్యకవితా సదస్సు’లో మీ బాధ్యకు లక్ష్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను.
ధన్యవాదాలు శంకరయ్యగారూ. గణేశ స్తుతికి స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి