Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 01, 2013

సమస్య: పాదమ్ములు లేని నరుఁడు పరుగి డఁ జొచ్చెన్

"పాదము" శబ్దమునకున్న యర్థములలో "నాల్గవ భాగ"మను నర్థముం గ్రహించి, చేసిన పూరణము...

మోదముతో నాస్తి మువురు
సోదరులే సర్వముఁ గొని, సుఖముగ నుండన్;
వేదన తోడుతఁ, దన కే

పాదమ్ములు లేని నరుఁడు, పరుగిడఁ జొచ్చెన్!

(తన ముగ్గురు సోదరులు చేసిన మోసమును న్యాయాధికారులకుం దెలుపుటకై పరుగులు దీసినాఁడని తెలియునది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి