తేది: జూన్ 28, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
శివ - హర - భవ - రుద్ర
పదాలను ఉపయోగిస్తూ...విష్ణువును స్తుతిస్తూ
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము
హరి! రథాంగపాశి! వనమాలి! రవినేత్ర!
శార్ఙ్గధర! వరాహ! రమేశ! శంఖపాణి!
పద్మనాభ! వరాంగ! సువర్ణవర్ణ!
స్వభు! గరుద్రథరథ! చక్రి! పాహి పాహి!!
(గరుద్రథరథ=[గరుద్రథుఁడు=గరుత్మంతుఁడు] గరుత్మంతుని రథముగా [=వాహనముగా] గలవాఁడా..అనఁగా ఓ విష్ణుమూర్తీ...అని తాత్పర్యము)
chala goppa vishayam..ippatiki telugu lo ilantivi jarugugutunnayi ante telugu bhasha nu munduku teeskuvelle ratha sarathulu eppatiki vastune vuntarani nammutunnanu
రిప్లయితొలగించండిధన్యవాదాలు దిలీప్ రాజ్ గారూ! మీ అభిమానానికి కృతజ్ఞతలు. స్వస్తి.
రిప్లయితొలగించండి