కామిత హరి రాజ్యంబునుఁ
బ్రేమనుఁ గాయంగఁ గోరి వేగిర పడఁగన్
భీమాజి డిందఁ జేసియు
రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్!
(హరిరాజ్యంబు=వైకుంఠము)
[వైరియై రావణుఁడు, తానతి శీఘ్రముగఁ బొందం గోరిన వైకుంఠ ధామ ద్వారపాలకత్వమును దయతోఁ బ్రసాదింపఁగ శ్రీరాముఁడు భీకర యుద్ధముం జేయు నెపమునఁ జంపి, యతని కోరికనుం దీర్చెనని తాత్పర్యము]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి