తేది: ఆగస్టు 14, 2015 న వాట్సప్ లోని "పండిత సమాఖ్య" లో నొక మిత్రుఁడు దత్తపది శీర్షికన
సమంత-తమన్న-త్రిష-అనుష్క
పదాలను ఉపయోగించి
భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని గూర్చి
నచ్చిన ఛందస్సులో వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము
(తెల్లదొరలను పాఱఁద్రోలడానికి భారతస్వాతంత్ర్యోద్యమ యజ్ఞాన్ని, ధనుర్వేదాన్ని దీక్షతో సాధనఁ జేయు ధానుష్కులవలె చేయవలెనని గాంధీజీ భారతీయులనుం గోరిన సందర్భము)
"దుష్ట సితముఖుల్ సేసిన దోసమంతఁ
గదలఁ ద్రోలి, భరతమాతఁ గాతమన్న;
భారత స్వతంత్ర త్రిషవణముఁ జేయ
వలయు ధానుష్క దీక్షిత స్వరువు వోలె!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి