Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2015

సమస్య: బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!

తేది: ఆగస్టు 09, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మట్టిపనిఁ గట్టిపెట్టియు
నట్టులె బట్టలనుఁ గట్టి యట్టిట్టులఁ దా
గట్టులఁ బట్టఁగ మాసిన
బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!




5 కామెంట్‌లు:

  1. *paina chupina puranamuku samabandham leni prashna kani mimmulanu inka ela adagalo teliyadu*

    Prashna emiti ante ''Karnudu purva janmalo nara narayanulatho yuddham chesina rakshasudu ani memu vinnamu idi nijama? ayithe atani peru emito meeku telusa? aa vishayam gurinchi memu konchem telusukodalichamu..daa chesi telupagalaru''

    *telugu lo vyakhya ela rayalo inka telusu koledu anduku manninchandi. konchem ibbandi ayina sare english lo chadivi naa prashna ku samadhanam telupa galaru*

    రిప్లయితొలగించండి
  2. చూడండి Unknown గారూ!

    మీరు మీ స్వీయనామమును మఱుగు పఱచి ఆకాశనామునిగా నన్నుం బ్రశ్నించుట బాగుగా లేదు.

    మీరు అడిగినట్లు కర్ణుడు గత జన్మలో "సహస్రకవచుడు" అనే రాక్షసునిగా జన్మించాడు. అతనితో్ నరనారాయణులు యుద్ధమొనర్చి యతని వేయి కవచములలో నొకదానిని తప్ప అన్నింటిని ఛేదించినారు. ఈ జన్మలో నతడా కవచముతోడనే పుట్టగా, ఇంద్రునిచే దానముగా ఆ కవచమును గ్రహింపజేసి, భారతయుద్ధమం దతనిని యర్జునునిచే శ్రీకృష్ణుడు చంపించినాడు.

    *** ***

    తెలుగులో మీరు వ్యాఖ్య పెట్టాలనుకొంటే...

    మీది... పర్సనల్ కంప్యూటర్ అయితే...www.lekhini.org ను download చేసుకొని ఇంగ్లీషులో టైపు చేస్తే తెలుగులో వస్తుంది.

    మీది...మొబైల్ అయితే...telugumata గానీ, multilingkeyboard గానీ, swiftkey keyboard గానీ download/install చేసుకుంటే సరి. తెలుగులో చక్కగా టైపు చేయగలరు.

    ఇంతకీ మీ పేరు తెలుపుతారా...లేదా...?

    సమాధానం ఈయగలరు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. ఆఁ తెలిసినది. మీరు...

    sathi reddy

    పనిచేసినది ZPS venkatapur

    నివసిస్తున్నది nalgonda

    (మరి మీరు unknown గా ఎందుకు ప్రశ్నించినట్టు?)

    రిప్లయితొలగించండి
  4. నన్ను క్షమించాలి సర్...నేను Sathi Reddy గారి అబ్బాయి ని ..మీ బ్లాగ్ ను ఇంకా కర్రెక్ట్ గా ఫాలొ కాలేదు అందుకే కామెంట్ చేసేటపుడు Default గ వున్న గూగుల్ ఖాతా ను వుంచాను అది కాస్తా Unknown గ వచ్చింది నా అజ్ఞానాన్ని మన్నించాలి
    మా నాన్న చాన్స్ దొరికినపుడు మీ 'మధుర కవనం' చూస్తుంటాడు. నేను కూడ 'నా తెలంగాణ కోటి రతనాల వీణ బ్లాగ్ ని చూస్తుంటాను హైదరబాద్ వాళ్లు పొద్దున 9 వరకు లేవరు అది అలవాటు చేసింది అంధ్ర పాలకులె అనె వాదన చాలా కరెక్ట్ గా వుందనిపించింది ఎందుకంటె అప్పటివరకు అంధ్ర వాల్లు తెల్ల వారు జామునె లేచి పనులు చుస్కుంటరు మన వాల్లె పొద్దున 7-8 వరకు లేవరు అని misconception విన్నాను కాని మన వాల్లు కేవలం 4 గంటలు మాత్రమే నిద్ర కు వెచ్చించి పని చేసుకునె కష్ట జీవులు అని మీ రాసినది చదివినాక తెలిసింది అల అనుకునె కొంత మందికి అర్దం అయ్యేల చెప్పాను కూడ
    తెలుగు ట్రాన్స్లేటర్ 'లేఖినీ గురించి కూడ చెప్పినందుకు ధన్యవాదలు
    ఇంకా ఇలాంటి మనోరంజకమైన మేలు కొలిపే విషయాలు రాయలని ఆశిస్తూ సెలవు

    రిప్లయితొలగించండి
  5. చాలా సంతోషం సత్తిరెడ్డి గారూ! నా "మధుర కవనం" చూసే మీ నాన్నగారికి నా నమస్కారాలు తెలుపండి. "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" మన తెలంగాణుల కోసమే...నడుపుతున్నాను. ఆంధ్రావాళ్ళు మనను అమాయకులను చేసి అన్ని విధాలుగా దోచుకుంటున్న తీరుతెన్నులను తెలంగాణులకు తెలుపాలనే తపనతో దీనిని ప్రారంభించాను. చాలా వరకు కృతకృత్యుడినయ్యాననే భావిస్తున్నాను. మీతో పాటుగా మన తెలంగాణ సోదర మిత్రులందఱకును దీనిని పరిచయం చేసి, అనునిత్యం దీన్ని వీక్షింపజేయగలరని మిమ్ము కోరుతున్నాను. నా లక్ష్యం బంగారు తెలంగాణను సాధించి దేశం లోనే మన రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనించాలని! అలాగే ఆంధ్రావాళ్ళు తెలంగాణలో పద్యకవులు లేనేలేరనే అపప్రథను తొలగించడానికే ఈ "మధుర కవనం" బ్లాగును నడుపుతున్నాను. దీనిని కూడా మీ మిత్రులకు, సోదర తెలంగాణులకు పరిచయం చేయగలరు.

    శుభాభినందనలతో,
    సెలవు...
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి