సాహితీ మిత్ర కవి పండిత వీక్షకాళికి
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!
తేది: అక్టోబర్ 13, 2013 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నేను రాసిన పూరణము:
అసమానోజ్జ్వల దివ్య శక్తి యుతయై, హర్యక్ష సంయానయై,
యసురానీక వినాశకాయుధకర ప్రాంచన్మహోద్వేగయై,
యసురుం ద్రుంచ భవాని, భూజనులు "నాహా" యంచు వెల్గించ "నా
దసరా పండుగ" దివ్యకాంతులను సంధానించె దీపావళిన్!
మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పద్యం. గణయతిప్రాసల స్పీడ్ బ్రేకర్లను లెక్కచేయని మీ శబ్దప్రయోగసామర్థ్యం ప్రశంసనీయం.