శుక్రవారం, అక్టోబర్ 24, 2014
న్యస్తాక్షరి: ప్రతి పాద ప్రథమాక్షరాలు వరుసగా స-రి-గ-మ...సంగీత వర్ణన...ఆటవెలది పద్యంలో...
తేది:
అక్టోబర్ 04, 2014
నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన
అంశం- సంగీతము.
ఛందస్సు- ఆటవెలది.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా స, రి, గ, మ ఉండాలనగా
నేను రాసిన రెండు పద్యములు:
ప్రథమ పద్యము:
స
రిగమపదనియను సప్తస్వరాలు స
రి
త్సమప్రవాహ రీతి రాగ
గ
మక తాళ మిళిత గాత్రసంగీతమై
మ
ధువులూరుచు మన మనసు దోచు!
ద్వితీయ పద్యము:
స
ర్వకాలములను సంగీత సమ్రాట్టు
రి
త్తఁబుచ్చకయె తరింపఁజేయు
గ
గనగంగఁ బోలు గాత్రసంగీతమున్
మ
నుజజాతి కొసఁగి మాన్యుఁ డాయె!
2 కామెంట్‌లు:
కంది శంకరయ్య
శనివారం, అక్టోబర్ 25, 2014 8:11:00 PM
మీ పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురకవి గుండు మధుసూదన్
శనివారం, అక్టోబర్ 25, 2014 8:49:00 PM
ధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి