తేది: సెప్టెంబర్ 30, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
కాకి - కోయిల - బాతు - నెమలి
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి:
(తననుఁ బట్ట నుంకించుచున్న కీచకుని ద్రౌపది వారించు సందర్భము)
"వలదు కీచకా, కిన్క! నన్ బట్టుకొనియు
మత్పతుల ప్రతిక్రియ నంది మ్రందకోయి!
లలిని స్త్రీ షాడ బాతురుం డెలమిఁ గనఁగ
బుద్ధియుతుఁడౌనె, మలిన కర్ముఁ డగుఁగాని?!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి