తేది: ఆగస్టు 19, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన వామనావతార చిత్రమునకు
నేను రాసిన మత్తేభ విక్రీడిత వృత్తము (పంచపాది)
సురలోకాధిపు నింద్రు గెల్చి, యతనిన్ శూన్య స్వరాట్పీఠునిన్
బరువెత్తించిన రాక్షసేంద్రుని బలిన్ బ్రహ్లాద పౌత్రున్ వెసన్
హరి కోరెన్ దగ వామనాఖ్య వటుఁడై త్ర్యంఘ్రి స్థలమ్మీయఁగన్;
వర మీయంగఁ ద్రివిక్రముండయి బలిన్ బాదమ్మునం ద్రొక్కియున్
గరుణించెన్ సుతలాధిపాలునిగఁ; దత్కంజాక్షు నేఁ గొల్చెదన్!
-:శుభం భూయాత్:-
అద్భుత పదవిన్యాసంతో, చక్కని ధారతో మీ పద్యాలు సుజన మనోరంజకంగా అలరారుతున్నాయి. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండి