తేదీ: ఆగస్టు 27,2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఇచ్చిన
నన-నీనీ-నును-నేనే..శబ్దాలను ఉపయోగిస్తూ, నచ్చిన ఛందస్సులో,
భారతార్థంలో రాయమనగా...నేను రాసిన పద్యాలు
నన-నీనీ-నును-నేనే..శబ్దాలను ఉపయోగిస్తూ, నచ్చిన ఛందస్సులో,
భారతార్థంలో రాయమనగా...నేను రాసిన పద్యాలు
మొదటి పద్యం:
ఉత్పలమాల:
వేదన నంది ద్రౌపది తపించుచు నిట్లనెఁ గృష్ణుఁ జెంత "దా
మోదర! సంధిఁ గోరుచునుఁ 'బోరును వద్ద'నుచుండఁ గంటి, నీ
నీ దృఢ వాక్కు సంధికిని దూరమె? నిక్కము వల్కుము! వారునున్ను, నే
నేదెసఁ బోవఁగా వలయు? నీ విటఁ దెల్పుము కృష్ణ! యిప్పుడున్.
రెండవ పద్యం:
తేటగీతి:
"ఆననమ్మున దుఃఖమ్ము నగపడకయుఁ
జేతు, మానినీ! నీకున్న చింతఁ దీర్ప,
దుస్ససేను నుక్కడఁగించి, దోర్బలమున
ఱొమ్మునే నేనుఁ జీల్చియు, రుధిర మిడుదు!"
[అరణ్యాజ్ఞాతవాసాలు ముగిసిన తదుపరి భీముఁడు ద్రౌపదితోఁ బలికిన సందర్భము]
తానును తమ్ములున్ సతము ధర్మము దప్పడు ధర్మరాజు తా
రిప్లయితొలగించండికానన సీమలం గడుపు కాలము నందును నాంబికేయ ! నే
నే నినునమ్మి వారి గమనించుచు గాచితి నింక పారనీ
నీ నృప ధర్మబుధ్ధి కరుణింపుము పంచుము రాజ్య భాగమున్ .
లక్కాకుల వెంకటరావుగారూ! చాలా బాగా రాశారు. అభినందనలు. కాకపోతే, "తాను" పునరావృతమయింది. తానూ, ధర్మరాజూ ధర్మము "దప్పరు" అనవలసింది, "దప్పడు" అని ఏకవచనంలో రాశారు. మొత్తానికి బాగారాశారు. నా పద్యాలకు స్పందించినందుకు, ప్రతిపద్యం రచించినందుకు ధన్యవాదములు.
తొలగించండిమరొక విషయం...తమరి "సుజన-సృజన"లో తమరు రాసిన కైత ద్వారా... విశిష్ట ప్రేమను తెలియజేస్తూ, పరమేశ్వరుని నుండి కార్మికుల వరకు గల ప్ర్ర్ర్రేమ తత్త్వాన్ని ఆవిష్కరించారు. నాగరికత వెర్రితలలు వేసిన నేటి సమాజంలోని నీచుల స్వార్థకామాన్నీ ఆవిష్కరించారు. ఉత్తరోత్తరా ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటించారు. కవిత చాలా బాగుంది. అభినందనలు.
రోజూ ఇలాగే నా బ్లాగును దర్శించి, వ్యాఖ్యలు పెట్టగలరు. స్వస్తి.