తేది: ఫిబ్రవరి 09, 2013 నాడు వరంగల్లులో జరిగిన సంపూర్ణ భాగవత శతావధానంలో ప్రముఖ శతావధాని శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం గారికి నేనిచ్చిన సమస్యకు అవధానిగారి పూరణము మరియు నా పూరణము...
అవధానిగారి పూరణము:
సకలము స్వామి కర్పణము సల్పుచు, గుండెలలోన నిల్పుచున్,
బ్రకటిత భక్తి భావముల పాదము లంటి నమస్కరింపఁగా,
వికృతినిఁ జెంది, శ్రీహరి ప్రవీణతఁ జూపుచు, నంటి రాఁగ లే
మ, కరినిఁ గాచె శ్రీహరియె, మానస మందున సంతసించుచున్!
నా పూరణము:
“అకట! మదీయ హృత్స్థిత మహార్తి విదారక! కావు మయ్య!!”నాన్;
బ్రకటిత భక్తి మెచ్చుచును వచ్చియుఁ, జక్రముచేత నక్రమున్
వికలముఁ జేసి, భక్తునకు వేదన డుల్చియు, నా “గజేంద్ర నా
మ” కరినిఁ గాచె శ్రీహరియె, మానస మందున సంతసించుచున్!
వికలముఁ జేసి, భక్తునకు వేదన డుల్చియు, నా “గజేంద్ర నా
మ” కరినిఁ గాచె శ్రీహరియె, మానస మందున సంతసించుచున్!
అవధాని గారి పూరణ బాగుంది. మీ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిమీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ! మీకూ, మీ కుటుంబ సభ్యులకూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!
తొలగించండి