తేది: ఆగస్టు 25, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
లంగా-లుంగీ-చీర-దోవతీ ...పదములను
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులోవ్రాయమనగా
నేను వ్రాసిన రెండు పద్యములు:
(ఖాండవ వనమును దహించి, మయ విరచిత యింద్ర[ఖాండవ]ప్రస్థముగ నొనర్చిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)
మొదటి దత్తపది: కందము:
ఖాండవ తరులం గా లిచిమెండు బలుం గీ డుఁ ద్రోచి మేలైన భువిన్
గండరగండఁడు చీరఁ గ
దండిగ హరి దోవ తీ సెఁ దమ నగరముగన్!!
రెండవ దత్తపది: (పై పద్య భావమునే మత్తేభమునందు):
తరులం గా లిచి ఖాండవానఁ దగ నింద్రప్రస్థమన్ రాజధా
ని రచింపన్ మయు సాయమంది, బలులుం గీ ర్త్యాత్ములున్ రాజ్యపా
లురునై చీరఁ గఁ, బాండునందనుల నాల్గుం దిక్కులం గెల్వఁగన్
బురికొల్పంగను, నశ్వమేధమునకున్ బ్రోత్సాహియై దోవతీ
సి, రణోన్ముఖ్యవిజేతృ భాగ్యమొసఁగెన్ శ్రీకృష్ణుఁడే మాన్యుఁడై!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి